వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవాలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 11 :
నంద్యాల జిల్లా కేంద్రంలో వైయస్సార్ సెంటినరీ హాలు కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి ఈ జగ్గయ్య అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వడ్డే సామాజిక వర్గానికి చెందిన వడ్డెరలు సుమారు 500 మంది ఈ జయంతి ఉత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
వడ్డే ఓబన్న 1845 లోనే ప్రధమ స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచారని, ఆయన చేసిన స్వాతంత్ర పోరాటమును ప్రముఖులు కొనియాడారు. ఈ సమావేశంలో వడ్డే సంఘం వాసులు బాల నరసింహులు, చక్రధర్, సుబ్బరాయుడు, మంజుల సుబ్బరాయుడు, శ్రీనివాసులు, చల్ల మద్దిలేటి, వడ్డే సురేష్, వడ్డే రాజు తదితరులు మరియు బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది హాజరయ్యారు.

Scroll to Top