వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన నంద్యాల జిల్లా పోలీసులు

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 11 :
స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగంధర్ బాబు మాట్లాడుతూ, వడ్డే ఓబన్న సామాజిక న్యాయం, స్వాతంత్ర్య స్పూర్తితో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని ఆయన ధైర్యం, త్యాగం నేటి తరాలకు ఆదర్శప్రాయమని తెలిపారు.
సామాజిక సమానత్వం, న్యాయం కోసం వారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ ప్రేరేపించేదిగా ఉందని అన్నారు. వడ్డే ఓబన్న ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తో పాటు జిల్లా సాయుధబలగాల DSP శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, సురేష్ బాబు,జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొని వడ్డే ఓబన్న సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.

Scroll to Top