రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించండి..సురక్షితంగా గమ్యం చేరండి – ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాష

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 12 :
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS సూచనలతో ఈరోజు సాయంత్రం నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా వారి సిబ్బందితో కలిసి చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ద్విచక్ర వాహనదారులకు రోడ్ సేఫ్టీ మరియు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వారికి హెల్మెట్ ప్రాముఖ్యత, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మైనర్ డ్రైవింగ్ మానుకోవాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదు తప్పనిసరిగా రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Scroll to Top