

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 29 :
రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా తన యొక్క సిబ్బందితో నంద్యాల పట్టణ కేంద్రంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లను, వాహనదారులను, ప్రజలను సమావేశపరిచి అందరికీ సులువుగా అర్థం చేసుకునే విధంగా దృశ్య మాధ్యమాల ద్వారా మరియు గోడ ప్రతుల ద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి కలిగి ఉండాలి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదంతోనే జరుగుతున్నాయని కావున మోటర్ సైకిల్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను మరియు వస్తువులను రవాణా చేయరాదని, డ్రైవర్ కు ఇరుపక్కల ప్రయాణికులను కూర్చోబెట్టుకొని వాహనం నడపరాదు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అపరిమిత వేగంతో వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని మొదలగు రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు.
