రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు గ్రహీత అంజద్ భాష సిద్ధికికి ఘన సన్మానం

నంద్యాల జిల్లా / డిసెంబర్ 30 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
కర్నూలు అబ్దుల్ హక్ యూనివర్సిటీలో అంజాద్ భాష సిద్ధికి సన్మాన కార్యక్రమం
రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా పేర్కొనే డాక్టర్ అబ్దుల్ హక్కు అవార్డు అందుకున్న నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షుడు, జమిఆతే ఉలమాయే హింద్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అంజద్ భాష సిద్ధికిని అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పి.ఎస్. షా వలి ఖాన్, యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఎస్. మహబూబ్ బాషా, బృందం సభ్యులు ఘనంగా సన్మానించారు. కర్నూలులోని అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్రస్థాయి డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు గ్రహీత అంజాద్ భాష సిద్ధికి యూనివర్సిటీని పరిశీలించారు. ఉర్దూ యూనివర్సిటీకి వెళ్లిన సందర్భంగా అవార్డు గ్రహీత అంజాద్ భాష సిద్ధికిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ పి.ఎస్. షా వలి ఖాన్ మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి వారికి చేయూతనందిస్తున్న అంజద్ భాష సిద్ధికికి ప్రతిష్టాత్మకమైన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం అందియడం ఆనందంగా ఉందని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల ప్రాంతానికి చెందిన ఆయనకు అవార్డు ఇవ్వడంతో కర్నూల్లోని అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఖ్యాతి మరింతగా పెరిగిందని గుర్తు చేశారు. అవార్డు గ్రహీత అంజాద్ భాష సిద్ధికిని సన్మానించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. అంజాద్ భాషా సిద్ధికి మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆ అల్లాను ప్రార్థించారు. సన్మాన గ్రహీత అంజాద్ భాష సిద్ధికి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కర్నూల్ లోని ఉర్దూ యూనివర్సిటీని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు.

Scroll to Top