

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 03 :
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డియాండ్ చేస్తూ జనవరి 5వ తేది ఛలో పోతిరెడ్డిపాడు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నంద్యాల వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాష, వైసీపీ రాష్ట్ర కార్యాదర్శి దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళ రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా కార్యదర్శి దేవనగర్ బాష, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్ వైయస్సార్ నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల అసెంబ్లీ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, మరియు మున్సిపల్ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు పిలుపు నిచ్చారు.
నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో ఛలో పోతిరెడ్డిపాడు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. రాయల సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని తిప్పికొడదామని వైసీపీ నేతలు పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ…రాయలసీమ వాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశారని విమర్శించారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు తెలంగాణా సీఎంతో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఆపారని ఆరోపించారు. ఇది రైతాంగానికి రాయలసీమ ప్రాంత ప్రజలకు, రాష్ట్రానికి తీరని అన్యాయం అన్నారు. రాయలసీమ ప్రాంతానికి రావలసిన సాగునీట వాటాకోసం, హక్కుల కోసం వైసీపీ పోరాటం తరుపున నిరంతరంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. అధికార ప్రభుత్వం రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు వైసీపీ ఆద్వర్యంలో చేపడుతున్న ఛలో పోతిరెడ్డిపాడు భారీ బహిరంగకు రాయలసీమ ప్రాంత రైతాంగం, ప్రజలు పోతిరెడ్డిపాడు సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
