
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 25 :
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు దాహం, ఎండ దెబ్బల నుంచి రక్షణ పొందేందుకు ఇలాంటి చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. పట్టణంలో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, ఎంఈ గురప్ప యాదవ్, డీఈలు నాగభూషణ్ రెడ్డి, పవన్ కుమార్, రసూల్, శానిటేషన్ సూపర్వైజర్లు లక్ష్మినారాయణ, శివ ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
