- భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ
- కొత్త బురుజు గ్రామం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్న స్పెషల్ పోలీస్ బలగాలు
- నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలి
- సీసీ కెమెరాలతో మరియు డ్రోన్ కెమెరాలతో నిఘా కట్టుదిట్టం
- విధులలో నిర్లక్ష్యం వహించరాదు




సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 08 :
నంద్యాల జిల్లాలోని డోన్ మండలం కొత్తబురుజు గ్రామం నందు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా సుమారు 900 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొత్త బురుజు గ్రామం మరియు పరిసర ప్రాంతాలను ఇప్పటికే స్పెషల్ పార్టీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు జరిగింది. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పోలీస్ జాగిలాలతో మరియు బాంబు డిటెక్షన్ టీం సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ జరుగుతుంది..కొత్తబురుజు గ్రామంలో నిర్వహించే సభా ప్రాంగణానికి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాల పార్కింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.
సిబ్బందికి సూచనలు :
బందోబస్తుకు వచ్చిన అధికారులను సిబ్బందిని సమావేశపరిచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత నిర్వహించాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది.. ఎట్టి పరిస్థితులలో మీకు నియమించిన డ్యూటీ ప్రదేశాన్ని వదిలి వెళ్ళ రాదు. ప్రజలు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉన్నందున మీరు విధులు నిర్వహించు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తతో విధులు నిర్వహించాలి. డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది విధులలో నిర్లక్ష్యం వహించరాదని, మీకు అప్పగించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలన్నారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
