


సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 14 :
నంద్యాల పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్కు శనివారం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ డిజిపి, విశ్రాంత ఐపీఎస్ అధికారిణి అరుణ బహుగుణ ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి నంద్యాలకు సాదర స్వాగతం పలికారు. బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిగా ఆమె అందించిన సేవలను ఫయాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, ఉర్దూ డిఐ అస్ముద్దీన్, కౌన్సిలర్ నాగార్జున, 38వ వార్డు టిడిపి ఇంచార్జి బుగ్గ రాముడు, 31 వ వార్డ్ టీడీపీ ఇంచార్జి దీపక్ రెడ్డి, బీసీ సాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి గోవింద నాయుడు, పుసులూరు ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
