భవన కార్మికులకు సంక్షేమ పథకాలు

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ ఎన్ బషిరున్నీసా బేగం

సత్యం వార్త / నంద్యాల / మార్చి 02 :

జిల్లాలోని నమోదిత భవన నిర్మాణ కార్మికులకు 01-03-2026 నుండి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్  ఎన్. బషిరున్నీసా బేగం సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.  వివాహ సహాయం కింద రూ.40,000, రెండు కాన్పులకు రూ.20,000, సహజ మరణానికి రూ.,60,000, దహన సంస్కార ఖర్చులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 01-03-2026 తర్వాత జరిగిన సంఘటనలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. నమోదిత కార్మికులు లేబర్ కార్డులు తప్పనిసరిగా రీన్యువల్ చేసుకుని అవసరమైన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ ఎన్. బషీరున్నీసా బేగం సూచించారు.

Scroll to Top