



సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 13 :
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ నందు గల ఉస్మానియా పాఠశాల నందు ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎండి ఫయాజ్ మరియు గౌరవ అతిథిగా మనియర్ ఖలీల్ పాల్గొని విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రదర్శనల సందర్శించి వారికి ప్రశంస పాత్రలు అందించారు, అనంతరం ఎన్‌ఎండి ఫయాజ్ మాట్లాడుతూ పిల్లలు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన వారిలో ఆలోచనా శక్తి, సృజనాత్మకత మరియు ప్రతిభ ను వెలికి తీసే మంచి అవకాశం ఉంటుందన్నారు.
ఖలీల్ మాట్లాడుతూ విద్యార్థుల జ్ఞానాన్ని కేవలం తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయకుండా ఆచారణాత్మకమైన జ్ఞానాన్ని అందించడంలో ఇటువంటి విద్య ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యునుస్ అహమ్మద్, కరెస్పాండంట్ షేక్షా వలి, ఎఓ. అబ్దుల్ హాది, ఉపాద్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
