బీజేపీలోకి సీపీఐ, ఎంఆర్పీఎస్ నాయకుల చేరిక

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 19 :

గురువారం నంద్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ నుండి గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాళింగిరి రాముడు, ఎంఆర్పీఎస్ నాయకుడు పసుపుల ఎర్రన్నతో పాటు ముఖ్య కార్యకర్తలు, మైనార్టీ మహిళా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు.

బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పారదర్శక అమలు, దేశాభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు తమను ఆకర్షించాయని నాయకులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ వేదికగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో వారికి పార్టీ కండువాలు వేసి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతోందని, అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళలు పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. కొత్తగా చేరిన నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top