బడ్జెట్‌లో మైనార్టీలకు పెద్దపీట: మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ కు ముస్లిం మైనార్టీ  నాయకుల ఘన సన్మానం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 16 :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రూ. 6090 కోట్లు భారీగా నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, నంద్యాలలో ముస్లిం మైనార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం నంద్యాల టౌన్ 19 వ వార్డు టీడీపీ ఇంచార్జి షేక్ మొహమ్మద్ రఫీ (మున్నా) ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు భారీ ఎత్తున నంద్యాలలో ఉన్న మంత్రి కార్యాలయానికి చేరుకొని మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ రఫీ (మున్నా) మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 6090 కోట్లు కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు కి, మంత్రి ఫరూక్ కి మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. సన్మానం స్వీకరించిన అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నిధులతో మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ ముస్లిం మైనార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top