అభినందించిన మంత్రి ఫరూక్
అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేసిన మంత్రి ఫరూక్


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 04 :
ప్రధాని 15 సూత్రాల పథకం అమలు కమిటీలో సభ్యునిగా నంద్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయుడు ఉస్మాన్ భాష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉస్మాన్ బాషాకు అపాయింట్మెంట్ కాపీనీ అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్, మరో కమిటీ సభ్యుడు దేవిపాల్ దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని ఈ కమిటీ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్ మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ న్యూ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రాం కమిటీని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు తదితర జిల్లా అధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారని తెలిపారు.
