

సత్యం వార్త / జనవరి 19 :
మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్ (గ్రీవెన్స్) కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించి, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోన్ కాల్స్ ద్వారా వెంటనే పరిష్కరించగల సమస్యలను ప్రజాదర్భార్ వేదిక నుంచే పరిష్కరించగా, మిగతా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ప్రజా దర్భార్ కార్యక్రమం ప్రజలలో విశేష స్పందనను పొందింది.
