

పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 78 ఫిర్యాదులు…
విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం……
- జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS.
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ రిపోర్టర్ / జనవరి 5:
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 05-01-2026) నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఫిర్యాదిదారుల నుంచి 78 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుల వివరాలు:
1).ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సుమారు 7,50,000/-రూపాయలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసిందని నాకు న్యాయం చేయండని ఇందిరానగర్ ఒంగోలుకు చెందిన ఓబులేసు జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేశారు.
2). LIC నందు ఏజెంట్ గా పనిచేస్తున్న B.లక్ష్మీనారాయణ నన్ను నమ్మించి 13 సంవత్సరాలకు గాను 1,87,365 కట్టించుకొని 13 సంవత్సరాల తర్వాత 1,06,271 రూపాయలు వస్తుందని ఇదే తీసుకోవాలని నన్ను బెదిరిస్తున్నాడు. నాకు న్యాయం చేయండని నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన కృష్ణ కుమార్ జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేశారు.
3). నువ్వు నాతో కాపురం చేయాలంటే అదనపుకట్నం తీసుకురావాలి లేదంటే బయటికి పో అని నా భర్త నన్ను శారీరకంగా మానసికంగా నిత్యం వేధిస్తున్నాడు నాకు న్యాయం చేయండని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బాధితురాలు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
4). మా తల్లి కి సంబంధించిన రెండు ఎకరాల పొలాన్ని ఈడిగ. రామకృష్ణ కబ్జా చేసుకొని తన కొడుకు శివ గౌడు పేరు మీద ఎక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని నాకు న్యాయం చేయండని డోన్ కోసం చెందిన E.రామకృష్ణ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
5). JCB తో నా కళ్ళల్లో చెట్లు పీకించి చేనుకు అడ్డంగా రాస్తా లేకుండా చేశారని నాకు న్యాయం చేయండని మిడ్తూరు మండలం తలముడిపి గ్రామానికి చెందిన అంకిరెడ్డి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
