పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “పోలీస్ సంక్షేమ దివస్” (గ్రీవెన్స్ డే)” ఏర్పాటు

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 23 :
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు “పోలీస్ సంక్షేమ దివస్” (గ్రీవెన్స్ డే)” ను నేడు నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి యొక్క సమస్యల గురించి ఎస్పీ గారికి తెలియచేసినారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకొని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ,పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమం ద్వారా సిబ్బంది సమస్యలపై సత్వర చర్యలు తీసుకోని పరిష్కరిస్తున్నామన్నారు. విధులలో సిబ్బంది ఇబ్బంది పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చెయ్యటమే లక్ష్యమని తెలియజేశారు.

Scroll to Top