
టెక్నాలజీ సహాయంతో సకాలంలో స్పందన
టూ టౌన్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన బాధితురాలు
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 12 :
నంద్యాల పట్టణంలో బుధవారం గిరినాథ్ సర్కిల్లో నివాసముండే శివకుమార్ ఉదయం కుటుంబ కలహాలతో భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు అనంతరం పిల్లలను స్కూల్ వద్ద నుండి తీసుకొని వచ్చి తన స్కూటీపై ఎవరికి చెప్పకుండా వెళ్లిపోవడం జరిగింది దీంతో హుటాహుటిన తల్లి ఆమె తరపు బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎస్సై సురేష్ కి ఫిర్యాదు చేయడం జరిగింది సిఐ అష్రఫ్ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన సీఐ సురేష్ శివకుమార్ ఫోన్ ను ట్రాక్ చేయడం జరిగింది శివకుమార్ పిల్లలను తీసుకొని గుత్తి రోడ్డులో వెళ్తుండడం ట్రాక్ లో చూపించింది వెంటనే పిల్లల తల్లిని, వారి బంధువులను స్వయంగా ఒక వెహికల్ ఎస్సై సురేష్ ఏర్పాటుచేసి వారితో కానిస్టేబుల్ తో పంపించడం జరిగింది. శివకుమార్ గుత్తిలో వారి సోదరుని ఇంటికి వెళ్లడంతో అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ శివకుమార్ ని కుటుంబ సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని పిల్లలను ఇలా బెదిరించి తీసుకురావడం నేరమని మందలించి పిల్లలను తల్లి వద్దకు చేర్చి స్వయంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కు బుధవారం రాత్రి 9 గంటలకు చేరుకోవడం జరిగింది. పిల్లలను కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఏదైనా చేస్తాడని భయపడిన తల్లి టూటౌన్ పోలీసులు రక్షించి క్షేమంగా తీసుకొని వచ్చినందుకు గాను సీఐ సురేష్ కి పిల్లలను రక్షించినందుకు ధన్యవాదాలు తెలిపింది. తన భర్త శివకుమార్ నుండి రక్షణ కల్పించాలని కోరింది పిల్లల జాగ్రత్త కోసం వెంటనే స్పందించిన టూ టౌన్ పోలీసులు సీఐ అశ్రప్ కి, ఎస్సై సురేష్ కి పట్టణ ప్రజలు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
