
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 12 :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి చేరుతున్న భక్తుల సౌకర్యార్థం పాతాళగంగ స్నాన ఘట్టాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం పరిశీలించారు. స్నాన ఘట్టాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్ల పరిశుభ్రత, తాగునీటి సరఫరా, దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా నియమించిన ఈతగాళ్లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని, రద్దీకి అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
