పవిత్ర రంజాన్ మాసంలో పుణ్యాలను మూట కట్టుకోండి

అన్ని మాసాలలో కెల్లా పవిత్రమైన మాసం రంజాన్ మాసం

జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్ ఆద్వర్యంలో రంజాన్ ధార్మక, సమాజసేవపై బహిరంగ సభ

ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 08 :

పవిత్ర రంజాన్ మాసంలో పుణ్యాలను మూట కట్టుకోవాలని, అన్ని మాసాలలో కెల్లా పవిత్రమైన మాసం రంజాన్ మాసమని మత పెద్దలు, ఉలేమాలు బోధించారు. జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్ ట్రస్ట్ ఆద్వర్యంలో రంజాన్ ధార్మక, సమాజసేవపై నంద్యాల పట్టణ మున్సిపల్ టౌన్ హాల్ నందు భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హైదరబాదుకు చెందిన హజరత్ మౌలానా గయాస్ అహ్మద్, సఫ బైతుల్ మాల్, బెంగళూరుకు చెందిన మాలానా హుమాయాన్ ఖాన్ సాహెబ్ లతో పాటు టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మనియార్ ఖలీల్, నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు అబులైజ్, అబ్దుల్ సమద్, బిల్డర్ అబ్దుల్లాతో పాటు

జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్ కమిటీ సభ్యులు మౌలానా హుస్సేన్ సాహెబ్ రషాది, మౌలానా ఇద్రిస్ సాహెబ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రంజాన్ యొక్క పవిత్రత, రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాసాల వల్ల కలిగే లాభాలు అలాగే ప్రవక్త యొక్క నడవడిక, రంజాన్ మాసంలో ఆయన అనుసరించిన విధానాలు తదితర వాటిని విపులంగా వివరించారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ నెలలో ఉపవాసాలు ఎలా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ప్రవక్త అనుసరించిన ఉదాహరణలతో సహా వివరించారు. తాము బాగుండడమే కాకుండా తమ పొరుగు వారికి కూడా సహాయం చేయాలన్న గుణం ప్రవక్త నుండి పలువురు ప్రవక్తలు ఆచరించారని, వాటిని ముస్లిం సమాజం ఆచరించాలని వారు పేర్కొన్నారు. సమాజసేవ కోసం చేయాల్సిన పనులు, వాటి అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Scroll to Top