పట్టాభిషేక మహోత్సవానికి మార్కెట్ ప్రసాద్ కు ఆహ్వానం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 17 :

కంది మల్లయ్యపుర మహాసంస్థానానికి చెందిన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో 8వ తరం 12వ మఠాధిపతిగా శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 24 నుండి 26 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు మఠం ప్రతినిధులు తెలిపారు.

ఈ మహోత్సవ శుభ సందర్భంగా నంద్యాల ప్రముఖ సామాజిక సేవకుడు మార్కెట్ ప్రసాద్ స్వగృహానికి మఠం ప్రతినిధి మంగళవారం వెళ్లి గౌరవపూర్వకంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. మార్కెట్ ప్రసాద్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నట్లు మఠం ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మార్కెట్ ప్రసాద్ మాట్లాడుతూ పట్టాభిషేక మహోత్సవానికి తప్పక హాజరై స్వాముల వారి ఆశీస్సులు పొందుతానని తెలిపారు. మహోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణాలు, ధార్మిక సభలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు, మఠానుయాయులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మఠం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అన్నదాన సేవతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

Scroll to Top