

సత్యం వార్త/ నంద్యాల /జనవరి 4 :
నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయం నందు నోబుల్ టీచర్స్ అసోసిమేషన్ నూతన క్యాలండర్, డైరీ, స్టిక్కర్ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము వచ్చిన తరువాత నూతన డీఎస్సీ జరిపి 16,000 పైగా ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చిందని మరియు ప్రతి సంవత్సరము డీఎస్సీ జరిపి ఉపాధ్యాయులను నియమిస్తూ ఉపాధ్యాము లకు అండగా వుంటూ వారి సమస్యలను అన్నింటిని ఒక్కొక్కటిగా తీరుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమములో నోబుల్ టీచర్స్ అసోసిమేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి అస్ముద్దీన్, జిల్లా గౌరవ అధ్యక్షులు మహనంది మండల విద్యాశాఖాధికారి రామసుబ్బయ్య, జిల్లా అధ్యక్షులు హరిపోతులూరు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి లక్ష్మినారయణ , అసోసియేట్ అధ్యక్షులు నాగ శేఘలు, కార్యదర్శులు మహమ్మద్ రఫీ, పి.క్రిష్ణ, మోహను, సుబ్బారావు, బాలస్వామి సీనిమర్ నాయకులు బెజవాడ, వెంకటేశ్వర్లు, రమణగౌడ్, వెంకటేశ్వర్లు, మహిళ నాయకురాలు నాగమణి, శోభ రాణి తదితరులు పాల్గొన్నారు.
