నంద్యాల లో మంత్రి ఫరూక్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా లో ప్రభుత్వాన్ని హెచ్చరించిన
సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు



సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 24 :
అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాలని, ఇంటి స్థలాలు ఇవ్వని పక్షంలో బాడుగ ఇళ్లలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు అద్దెను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్ నుండి మంత్రి ఫరూక్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అర్హులైన పేద ప్రజలతో మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయక తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మురళీధర్, ఏఐటియుసి నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసులు, ధనుంజయ్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ భూమన్ శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నంద్యాల పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, మరియు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు ఇల్లు లేనటువంటి నిరుపేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
