నంద్యాల జిల్లా ప్రజల బాగుకోసం అభయారణ్యంలో కాలినడకన – నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలఫై శ్రీశైల మల్లన్న ఆశీస్సుల కోసమే పాదయాత్ర

శ్రీశైలంలో  మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు భేష్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 14 :

కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫై, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫై, నా నంద్యాల జిల్లా ప్రజలఫై  శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల దీవెనలు, ఆశీస్సుల కోసం నల్లమల దట్టమైన పులుల ఆవాసమైన అభయారాణ్యంలో కాలినడకన 42 కిలోమీటర్ల దూరం లోని శ్రీశైలం వెళుతున్నానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.  శనివారం నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గం, ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామికీ పూజలు చేసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైలంకు నల్లమల అరణ్యం గుండా కాలినడక మొదలు పెట్టారు. ఈ సందర్బంగా నల్లమల అడవిలోని గోసాయికట్ట శ్రీ ఆంజనేయస్వామికీ విశేషపూజల అనంతరం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ తాను ప్రతి ఏటా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా నల్లమల అభయారణ్యంలో కాలినడక ద్వారా శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకుంటున్నానని, ఈ ఏడాది కూడా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ కాలినడక మొదలు పెట్టానన్నారు.

శ్రీశైలంలో  మొదటి రోజు శివ దీక్ష స్వాములపై పోలీసుల లాఠీ చార్జీ ఫై కొందరు విలేకరులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని వివరణ కోరగా, స్వాములఫై లాఠీ ఛార్జ్ అనవద్దని, మొదటి రోజు అంచనాకు మించి భక్తులు శ్రీశైలం రావడం వల్ల కొంత ఇబ్బంది వస్తావమని, భక్తులను నియంత్రణ చేయడం జరిగిందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా శ్రీశైలంలో సాఫీగా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారని, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రభుత్వం బాగా ఏర్పాటు చేసిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. వెంకటాపురం నుంచి నల్లమల అరణ్యంలో లక్షలాది మంది శివ భక్తులు శ్రీశైలంకు కాలినడకన వెళుతున్నారని, ఈ ఏడాది నల్లమల అభయారణ్యం లో పులుల లెక్కింపు జరుగుతున్నా భక్తులకు అటవీశాఖ ఎలాంటి  ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిందని, ప్రభుత్వశాఖలు, దాతలు కూడా అన్నదానం, ఉచిత వైద్యం, తాగునీటి వసతి నల్లమల అరణ్యంలో కాలినడక భక్తులకు కల్పించడం అభినందనీయం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

Scroll to Top