

నంద్యాల జిల్లా / డిసెంబర్ 31 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో 662 సెల్ ఫోన్ లను రికవరీ చేసి భాదితులకు అంధచేయడం జరిగినది. వాటి విలువ సుమారుగా Rs 1,22,47,500/-రూపాయలు.
నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరంలో మొత్తం 1170 మొబైల్ లను రికవరీ చేయడం జరిగినది మొత్తం వాటి విలువ 2,06,29,000 /- రూపాయలు.
మొబైల్ ఫోన్ లు పోగొట్టుకున్నవి రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు.
ఆంద్రప్రదేశ్ గౌరవ డిజిపి హరీష్ కుమార్ గుప్త ఆదేశాలమేరకు మరియు కర్నూలు రేంజ్ DIG శ్రీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆద్వర్యంలో మొబైల్ రికవరీచేయడం జరిగింది.
ఈ మొబైల్ లను వివిద రాష్ట్రలనుండి అనగా మహారాష్ట్ర, తమిళనాడు ,కర్ణాటక, గోవా , తెలంగాణా మొదలగు రాష్ట్రాల నుండి మరియు ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం మొదలగు జిల్లాల నుండి 662 మొబైల్ ఫోన్ లు రికవరీ చేసి బాదితులకు అప్పగించడమైనది.వీటి విలువ సుమారు 1,22,47,500/-రూపాయలు ఉంది.
జిల్లాలోనే అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 662 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS బుధవారం బాధితులకు అందజేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. మొబైల్ లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తామన్నారు అలాగే వ్యక్తి గత సమాచారం , బ్యాంకింగ్ సమాచారం మొదలగున్నవి ఆ మొబైల్ లలో ఉంటాయి కాబట్టి మొబైల్ ని జాగ్రత్త గా ఉంచుకోవాలి అని సూచించడం జరిగినది.
మొబైల్ ఫోన్ లతో పాటు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన భాద్యత పోలీసులపై ఉంటుందని సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరి అయిన వాటి పరిష్కారం పై నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
నంద్యాల జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్నా వ్యక్తి మిస్సింగ్ మొబైల్స్ కి సంబందిచిన వివరాలు www.ceir.gov.in పోర్టల్ నందు నమోదు చేసి కంప్లయింట్ చెయ్యవలెను లేదా ఈ మొబైల్ నెంబర్ కు 9121101107 whats app ద్వార హాయ్ అని మెసేజ్ చేయాలి. మీకు ఒక CEIR అనే పోర్టల్ కి సంబందించిన ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసిన యెడల పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో కృషిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గౌతమి ని వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.
