నంద్యాల జిల్లాలో పోలీసులకు స్మార్ట్ పోలీసింగ్ మరియు కొత్త క్రిమినల్ చట్టాలపై రెండు రోజుల శిక్షణ తరగతుల నిర్వహణ 

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 7 : నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ N.యుగంధర్ బాబు ఆధ్వర్యంలో DCRB ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు టెక్నికల్ టీమ్ సహకారంతో Smart Policing మరియు New Criminal Law లో భాగంగా ఉన్న అన్ని ఆన్‌లైన్ అప్లికేషన్ల పై రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ శిక్షణ కార్యక్రమం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో DG/IG Conference Dashboard, e-Sakshya, e-Summons, Cri-MAC (Crime and Criminal Tracking Network & Systems), MedLEaP (Medical Legal Evidence Preservation), MR (Monthly Reports), NATGRID(National Intelligence Grid), Sudarshan ,Gandiva తదితర కీలక ఆన్‌లైన్ వ్యవస్థలపై సవివరంగా అవగాహన కల్పించబడింది.

ఈ శిక్షణకు నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి దాదాపు 62 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు. వారికి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించి నేరాల నియంత్రణ, దర్యాప్తు ప్రక్రియలను మరింత మెరుగుపరచుకోవడంపై ప్రాయోగిక శిక్షణ అందజేయబడింది.

ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా పోలీస్ సిబ్బంది డిజిటల్ వ్యవస్థల వినియోగంలో నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు, కొత్త క్రిమినల్ చట్టాల అమలులో మరింత సమర్థత సాధించగలుగుతారని అధికారులు తెలిపారు.

Scroll to Top