

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 03 :
గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు తప్ప నంద్యాల ఆటోనగర్ కార్మికుల యొక్క దుస్థితి మాడటం లేదు..
ఆటోనగర్ ను సందర్శించి అక్కడి షాపులో యజమానులతో, కార్మికులను అడిగి ఆటోనగర్ సమస్యల గురించి తెలుసుకున్న ఎస్‌డిపిఐ నాయకులు..
పేరుకు మాత్రం నారా చంద్రబాబు నాయుడు ఆటోనగర్ అని పేరుతో పెద్ద బోర్డు ఆటోనగర్ అభివృద్ధిలో మాత్రం శూన్యం..
నంద్యాల ఆటోనగర్ లో 3 అడుగుల లోతులో మట్టి రోడ్లు గుంతల మయం కావడంతో రిపేరి చేయించుకోవడానికి ఎటువంటి వాహనాలు ఆటోనగర్ లోపలికి రాకపోవడం వలన వ్యాపారాలు లేక ఉపాధి కోల్పోతున్న నంద్యాల ఆటోనగర్ కార్మికులు..
నంద్యాల ఆటోనగర్లో గత 30 సంవత్సరాలుగా సరైన రోడ్డు లేక దుమ్ము, దులి, దుర్వాసన వల్ల ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం పాలవుతున్న నంద్యాల ఆటోనగర్ కార్మికులు..
ఆటోనగర్ కార్మికులు ప్రశ్నిస్తే నాయకులు మాత్రం హామీలు ఇవ్వడానిక తప్ప పనుల విషయంలో మాత్రం శూన్యం..
నంద్యాల ఆటోనగర్ లో మౌలిక వసతుల కల్పించడంలో నేడు పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కార్మికుల ఆగ్రహం..
ఎస్‌డిపిఐ నాయకుల దృష్టికి ఆటోనగర్ కార్మికులు తీసుకువచ్చిన సమస్యలు
నంద్యాల ఆటోనగర్ ప్రాంతం నేడు అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా మారింది..
పూర్తిగా ధ్వంసమైన రోడ్లు, మురుగుతో నిండిన కాలువలు, తాగడానికి కూడా దొరకని మంచినీరు – ఇవే నంద్యాల ఆటోనగర్ కార్మికుల రోజువారీ జీవితం..
రోడ్లు: గుంతలమయం అయి, వాహనాలు నడవలేని స్థితి. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు..
కాలువలు: మురికి కాలువలు లేక మురుగు నీరు రోడ్లపైకి వచ్చి, దోమల బెడదతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. రిపేరికి వచ్చే వాహనాల రాకపోకులకు ఇబ్బందిగా అయింది..
మంచినీరు: నిత్యావసరమైన తాగునీరు సరఫరా విఫలం. ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి..
ఇన్ని సమస్యలు ఉన్నా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండటం దుర్మార్గం.
నంద్యాల ఆటోనగర్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ప్రజల ఆగ్రహానికి పాలకులే బాధ్యత వహించాలి. తక్షణమే రోడ్ల పునర్నిర్మాణం, కాలువల శుభ్రత, క్రమబద్ధమైన మంచినీటి సరఫరా అమలు చేయాలి.
ఇది విజ్ఞప్తి కాదు – ఆటోనగర్ కార్మికుల న్యాయమైన డిమాండ్.
