నంద్యాలలో విద్యార్థి, యువజన ప్రజా సంఘాల పై పెట్టిన కేసులు రౌడీ సీట్లు, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే అసెంబ్లీ కార్యాలయం ముట్టడిస్తాం

ప్రశ్నించే వారి గొంతులు నొక్కాలని చుస్తే రెడ్ బుక్ ను ప్రకాశం బ్యారేజ్ లో ముంచుతాం

నంద్యాలలో జరిగినటువంటి ధర్నాలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఐక్య విద్యార్థి యువజన సంఘాల నాయకులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 9 : నంద్యాలలో విద్యార్థి యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, AISF నంద్యాల జిల్లా కార్యదర్శి ప్రతాప్, YSRCP యువజన నాయకులు చంద్ర శేఖర్ రెడ్డి, హరితవనం శ్రీను,PDSU జిల్లా కార్యదర్శి రాంబాబు, NSUI ప్రతాప్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసులు రౌడీ సీట్లు పీడీ యాక్ట్ లను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్త ఐక్య విద్యార్థి యువజన సంఘాల పిలుపుమేరకు నంద్యాలలో AISF, AIYF, YSRCP యువజన Adidas, PDSU, NSUI సంఘాల ఆధ్వర్యంలో బొమ్మలసత్రం నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎర్రి స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, AIYF నాయకులు ధనుంజయ్, వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు, ఏఐవైఎఫ్ నాయకులు మధు పాములేటి, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top