

- లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నిజాముద్దీన్ అధ్యక్షతన నిర్వహణ
- సదస్సు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ క్లబ్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఏ వి ఆర్ ప్రసాద్
- సేవా నిరతి లయన్స్ క్లబ్ ల ప్రధాన లక్ష్యం – డాక్టర్ గెలివి సహదేవుడు
- సేవా కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి – డాక్టర్ రవి కృష్ణ
సత్యం వార్త / నంద్యాల /జనవరి 11 : లయన్స్ క్లబ్ జిల్లా 316 జె లో ఐదవ జోన్ సదస్సు ఆదివారం నంద్యాలలో స్థానిక రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో జోనల్ చైర్మన్ నిజాముద్దీన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ క్లబ్ ల కౌన్సిల్ మాజీ చైర్మన్ ఏ.వి.ఆర్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.
జోన్ లో ఉన్న నంద్యాల,ఆదోని, బేతంచెర్ల,నంద్యాల సేవా ప్రగతి లయన్స్ క్లబ్ లకు చెందిన అధ్యక్ష ,కార్యదర్శులు, కోశాధికారులు,వివిధ హోదాలలో బాధ్యతలు చేపట్టిన నాయకులు పాల్గొన్న ఈ సదస్సులో జోనల్ చైర్మన్ నిజాముద్దీన్ మాట్లాడుతూ జోన్ లో ఉన్న అన్ని క్లబ్బులలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఇదేవిధంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.
ఏ.వి.ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ సేవలు వివిధ రంగాలకు విస్తృతం చేయాలని అన్నారు.లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ,పట్టణ పేదల కోసం వైద్య శిబిరాలు, దివ్యాంగుల సేవలు, విద్యా సేవా కార్యక్రమాలు నిర్వహించి సంస్థకు పేరు తీసుకురావాలని కోరారు.
సదస్సులో భాగంగా “సేవా- నాయకత్వం” అన్న అంశంపై డాక్టర్ గెలివి సహదేవుడు, “సేవా కార్యక్రమాల రూపకల్పన – నిర్వహణ” అంశంపై డాక్టర్ రవి కృష్ణ, “లయన్స్ క్లబ్ ల సంస్థాగత పరిపాలన” విషయంపై బవిరి శెట్టి శ్రీకాంత్,” అంతర్జాతీయ లయన్స్ పోర్టల్ లో సేవా కార్యక్రమాల నివేదిక ఇచ్చే విధానం” పై రవి ప్రకాష్,”అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఫౌండేషన్ విధివిధానాలు” గురించి పెసల శ్రీకాంత్ సభ్యులకు వివరించారు. పాల్గొన్న లయన్స్ క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు ఆయా క్లబ్ ల లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నివేదికలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశులు నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, సీనియర్ సభ్యులు ఆంజనేయులు గుప్తా, ఆడిటర్ వంకదారి గోపాలకృష్ణమూర్తి,ఎం.పీ.వి. రమణయ్య,కశెట్టి చంద్రశేఖర్, గోళ్ల సుదర్శనం శెట్టి , సభ్యులు పాల్గొన్నారు.
