నంద్యాలలో మహిళలకు ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని ఆర్థిక సహాయం అతి త్వరలో ప్రారంభం – గోళ్ళ రాజేష్

సంచలనాలకు మరో రూపం గోళ్ళ రాజేష్

గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో గృహిణీ, ఆర్థిక, సిరోథిని, నూతన పథకం అతి త్వరలో ప్రారంభం

నంద్యాలలోని ప్రతి వార్డు నుండీ 25 మహిళలకు కలిపి 5,00000 లక్షలు రూపాయలు వడ్డీ లేని ఆర్థిక సహాయం..

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 04 :

మన హిందూ దేశ ధర్మం ప్రకారం ఎక్కడ స్త్రీలు పూజించబడతారో..ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సాక్షాత్తు దేవతలు పూజలు అందుకుంటారని ప్రతితీ..సాధారణంగా మన ఇంటి గృహిణీమణులు వారు థనికులైన,పేద, మద్యతరగతి స్ర్తీలు మన కుటుంబంలో తల్లిగా,అక్కగా, చెల్లిగా, గృహిణిగా కుటుంబంలోని తన తల్లీ,తండ్రుల కుటుంబం అయినా,వారి మెట్టినింటి కుటుంబానికి అయినా మహిళలు గృహిణిగా మారగానే వారిరువురి కుటుంబ బాధ్యతలు సమంగా,సక్రమంగా ఇరు కుటుంబాలకు సమాజంలో కీర్తి,ప్రతిష్టలు తారాస్థాయికి చేరేసేందుకు కీలక పాత్ర మహిళలు పోషిస్తారు అన్నది అతిశయోక్తి కాదు.

ఇదే విషయాన్ని మరోసారి నారీ లోకం ఆర్థికంగా బలోపేతం కావాలని ఒక అన్నగా మన నంద్యాల నియోజకవర్గంలోని పొదుపు మహిళలు కాని సాథారన నంద్యాల నియోజకవర్గంలోని మహిళలకు వడ్డీ లేని రునాలను అందించి మహిళలకు తమ కుటుంబానికి ఆర్థికంగా తన వంతు సహాయ సహకారాలను అందించే ఆత్మస్థైర్యాన్ని నింపాలని గొప్ప దాతృత్వం తో నియోజకవర్గంలోని పేద, మద్యతరగతి మహిళలకు వడ్డీ లేని రుణాలను ఒక వార్డు నుండీ 25 మంది మహిళలుగా ఉంటే మీకు మీరే థాన్యరాసి గణులు.

మహిళలలో ఉండే ఓపిక , సహనం భూదేవి తో సమానం అలాంటి మహిళలు కొందరు  తమ వద్ద ఎంత తెలివి తేటలు ఉన్నప్పటికీ ఆర్థికంగా సహకారాలు లేక వెనకడుగు వేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మన నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త గోళ్ళ రాజేష్ వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని సంకల్పించారు.

అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ వివరిస్తాం..

మరిన్ని వివరాలు ఎలా, ఎవరిని సంప్రదించాలి అంటే..

మా కార్యాలయం..నంద్యాల నూనెపల్లే

కరేంట్ ఆఫీస్ ఎదురుగా సాయి ఆనంద నిలయం కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ 4వ నంబర్ నందు ఉన్న మా కార్యాలయం నందు సంప్రదించండి.

Scroll to Top