నంద్యాలలో ఘనంగా హజ్ యాత్రికుల శిక్షణ తరగతులు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 7 :

హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు అవసరమైన అవగాహన కల్పించేందుకు బుధవారం నంద్యాలలోని నేషనల్ పి.జి. కళాశాలలో ‘హజ్ యాత్రికుల శిక్షణ తరగతులు – 2026’ను ఘనంగా నిర్వహించారు. నంద్యాల మరియు కర్నూలు జిల్లాలకు చెందిన హజ్ యాత్రికుల కోసం ఈ ఉమ్మడి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అల్హాజ్ ఎన్ఎండి ఫరూక్,ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి అల్హాజ్ ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, యాత్రికులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని పవిత్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

మౌలానా అల్హాజ్ డాక్టర్ ఖాజీ అబ్దుల్ మజీద్ సాహెబ్ నిజామీ (కర్నూలు) యాత్రికులకు హజ్ యాత్రలో పాటించవలసిన నియమాలు, ప్రార్థనల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహమ్మద్, నేషనల్ కాలేజీ సెక్రటరీ రఫీ అహ్మద్, టిడిపి రాష్ట్ర యువ నాయకుల ఎన్ఎండి ఫయాజ్,  నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ మరియు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు పాల్గొన్నారు.

Scroll to Top