

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 04 :
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ , ఒమేగా హాస్పిటల్స్ (కర్నూలు) సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో భారీ ” రెండు కిలోమీటర్ల వాకథాన్” నిర్వహించారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా “యునైటెడ్ బై యూనిక్యూ స్టెప్స్ టూ బిల్డ్ కాన్సర్ అవేర్నెస్” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు విచ్చేసి వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ వాకథాన్ శ్రీనివాస్ సెంటర్ నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ “నేటి కాలంలో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధిగా మారినప్పటికీ, సరైన అవగాహన మరియు ముందస్తు జాగ్రత్తలతో దీనిని జయించడం సాధ్యమే అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, మితిమీరిన ఒత్తిడి మరియు పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు. శరీరంలో కలిగే చిన్న మార్పులను గమనించి, ప్రాథమిక దశలోనే వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చెయ్యవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ క్యాన్సర్ అంటే భయం మరియు అపోహలు ఉన్నాయి అని. వాటిని తొలగించి, ప్రజలను చైతన్యం చేయడంలో డాక్టర్ల పాత్ర అభినందనీయం అని ప్రశంసించారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు అని అన్నారు. డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ మరియు ఒమేగా హాస్పిటల్స్ కలిసి ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం అని. ఈ వాకథాన్ ద్వారా నంద్యాల ప్రజల్లో క్యాన్సర్ పట్ల చైతన్యం వస్తుందని ఆశిస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సి. గురు ప్రసాద్ (బీడీస్), సెక్రటరీ డాక్టర్ కె. శ్రవణ్ కుమార్ (బీడీస్), జాయింట్ సెక్రటరీ డాక్టర్ బి. సంతోష్ (ఎండీస్), డైరెక్టర్ ఉప్పర సురేష్ కుమార్, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్, చలం బాబు, బుగ్గ రాముడు, బోయ రామకృష్ణ లాల్ మరియు పలువురు వైద్యులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
