నంద్యాలలో ఘనంగా జనసేన సమన్వయకర్త జన్మదిన వేడుకలు

నంద్యాల జిల్లా / జనవరి 02- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

నంద్యాలలో ఘనంగా జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పట్టణంలోని పలు కాలనీలలో ఉన్న జనసేన కార్యకర్తల సమక్షంలో పిడతల సుధాకర్ కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన కార్యకర్తలు, పిడతల సుధాకర్ అభిమానులు మాట్లాడుతూ పార్టీ కోసం , పార్టీ కార్యకర్తల కోసం ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను ఎదురుకొని గత కొన్నాళ్లుగా జనసేన పార్టీని బలపరుస్తూ పార్టీ కోసం పని చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యమే పిడతల సుధాకర్ లక్షమని జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు కొనియాడారు. పిడతల సుధాకర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ప్రతి జన సైనికునికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి జనసేన కార్యకర్తకు, వీర మహిళలకు ఏ ఆపద వచ్చిన ఎల్లవేళలా తాను తోడుంటాడని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ను సంక్షేమంతో పాటు, అభివృద్ధి బాట వైపు తీసుకెళ్లే ఘనత కేవలం ఒక కూటమి ప్రభుత్వానికి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామ నాయకులు,పట్టణ కాలనీలకు చెందిన జనసేన నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి ,నందిగళ్ళ సందీప్,సురేష్ చౌదరి, సింహాసనం నగేష్,సాయి జయంత్,సంపత్, గిరి ,శంకర్,నాగార్జున,మహానంది మండల జనసేన నాయకులు మురళి, చందు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top