

సత్యం వార్త / నంద్యాల రిపోర్టర్ /జనవరి 5 :
నంద్యాల పట్టణంలో స్థానిక ప్రధమ నంది దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన భారీ అయోధ్య రామ మందిరం ఎగ్జిబిషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి ఎగ్జిబిషన్‌లోని వివిధ స్టాళ్లను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు వినోదాన్ని అందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని అన్నారు. స్థానిక వ్యాపారులకు కూడా ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అలాగే ఈ ఎగ్జిబిషన్లో అయోధ్యలో రామ మందిరం ఎలా ఉందో అలా సెట్ ఇక్కడ వేయడం జరిగిందని అక్కడికి వెళ్లలేని వారు ఇక్కడ ఈ నమూనాను చూసి రామ మందిరం ఇలా ఉంటుంది అని నంద్యాల ప్రజలకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు
ఈ సందర్భంగా నిర్వాహకుడు శ్రీను చౌదరి మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన వినోదం అందిస్తున్నామని ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, మిట్నాల రవి, ప్రముఖ పారిశ్రామికవేత రాజారామ్, జైలాన్, బోయ రామకృష్ణ, సాయిరాం, పిట్టల అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
