నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
నంద్యాల టౌన్ 14 వ వార్డు సుద్దుల పేట లో వార్డ్ ఇంచార్జ్ అడ్వకేట్ ఖలీల్ ఆధ్వర్యంలో లబ్ధిదారుకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్..
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు . 200 రూపాయలు ఉన్న పెన్షన్ వేయి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు..అదేవిధంగా 1000/- రూపాయలు ఉన్న పెన్షన్ 2000/- చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అన్నారు.. గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ ని 3000 పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని … ఏట 250/-రు పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారని … టిడిపి అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  చెప్పిన మాట ప్రకారం 3000/- రు పెన్షన్ ని 4000 పెంచుతూ అదేవిధంగా మూడు నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలా ప్రతినెల 1వ తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఒకటవ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీనే వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపు మార్చి 1 వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే అంటే 28 ఫిబ్రవరి 2026 వ తేదీన నంద్యాల సుద్దులపేట లో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో , అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . అనంతరం పింఛన్ లబ్ధిదారులకు అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు , జిల్లెల్ల శ్రీరాములు , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్ , జైలాన్ , సుధాకర్ , అంకాలు , ఎంబిటీ బాబు , కామిని మల్లికార్జున , ఎబినేజర్ , నాగేశ్వరరావు , షేక్ మహమ్మద్ రఫీ (మున్నా), వేణు , బుగ్గ రాముడు , సాయిరాం , వాకా వర ప్రసాద్, వేద సాయి , ఉప్పరి సురేష్ , మాజీ కౌన్సిలర్ కృపాకర్, పసుపులేటి నారాయణ , ఆర్డీవో విశ్వనాధ్ , నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న , నంద్యాల ఎమ్మార్వో శ్రీనివాసులు మరియు మున్సిపల్ అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులకు , కార్యకర్తలకు , అభిమానులకు , ప్రజలలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top