
- ఫిబ్రవరి 21, 22వ తేదీలలో
- నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో
- వేదిక: రామకృష్ణ పిజి కాలేజీ ప్రాంగణం*
3 లక్షల రూపాయల నగదు బహుమతులు
సత్యం వార్త / నంద్యాల /జనవరి 8 : ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఫిబ్రవరి 21, 22వ తేదీలలో నంద్యాల ఎస్బిఐ కాలనీలో ఉన్న శ్రీ రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ ఫీడే ఓపెన్ రాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
రామకృష్ణ డిగ్రీ కళాశాల లో గురువారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ రామ కృష్ణా రెడ్డి, అధ్యక్షులు డా. జి.రవికృష్ణ, నంద్యాల జిల్లా క్రీడాభారతి అధ్యక్షులు సుధాకర్,నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి టోర్నమెంట్ వివరాలు తెలియజేశారు.
నంద్యాలలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఫీడే ఓపెన్ రాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ప్రథమ బహుమతి 30 వేల రూపాయలు,ద్వితీయ బహుమతి 20 వేల రూపాయలు,తృతీయ బహుమతి 15 వేల రూపాయలు కలిపి,వివిధ విభాగాలలో మొత్తం మూడు లక్షల రూపాయల నగదు బహుమతులతో పాటు విజేతలకు ట్రోఫీలను, పతకాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపు www.apchess.org లో క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫిడే రేటింగ్ మెరుగుపరచుకోవడానికి, రేటింగ్ లేని క్రీడాకారులు కొత్తగా రేటింగ్ తెచ్చుకోవడానికి ఈ టోర్నమెంట్ ఉపకరిస్తుందని అన్నారు. ఈ సదవకాశాన్ని చెస్ క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
ఈ టోర్నమెంట్ లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సభ్యత్వం కలిగి ఉండాలి. సభ్యత్వం ఉన్నవారు 2025- 26 వ సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవలసి ఉంటుంది.
కొత్తగా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సభ్యత్వం చేసుకోవాలనుకునే వారు బాలాజీ కాంప్లెక్స్ లోని కళారాధన కార్యాలయం పై అంతస్తులో ఉన్న చెస్ అకాడమీలో సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా టోర్నమెంట్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9010451585.
