ధర్మాన్ని స్థాపించేందుకు అవతరించిన స్త్రీ మూర్తి కన్యకా పరమేశ్వరి అమ్మవారు – జిల్లా ఎస్పీ సునిల్ షొరాణ్ IPS

సమాజ శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం ఆత్మార్పణ చేసిన త్యాగమూర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 20 :
శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సంధర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునిల్ షొరాణ్ IPS అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం అంటే వాసవి మాత తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి, పరమాత్మలో లీనమైన పవిత్రమైన రోజు, ఆర్యవైశ్యులు ఈ రోజును అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, పార్వతీ దేవి పరమశివుడిని వివాహం చేసుకోవడానికి కన్యగా ఉండి ఘోర తపస్సు చేశారు. అయితే లోక కంటకుడైన బాణాసురుడిని సంహరించడం కోసం తన తపస్సు పూర్తి కాకముందే, భక్తుల కోరిక మేరకు శివకళ్యాణం జరగకుండా ఆగిపోయి, అమ్మవారు కన్యా రూపంలోనే ఉండిపోయారు. అమ్మవారికి కుంకుమార్చన, జలాభిషేకం, సామూహిక పారాయణాలు ఉంటాయి. వివాహం పూర్తి కాకపోయినా, తపస్సు అసంపూర్తిగా ఉన్నా, తన భక్తుల రక్షణ కోసం అక్కడే కొలువై ఉండాలని నిర్ణయించుకున్న ఆ మహా తల్లిని మనం పూజిస్తున్నాము. ఆమె ఆత్మార్పణకు గుర్తుగా కన్యకా పరమేశ్వరి రూపంలో వెలసి నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగంధర్ బాబు,సాయుధ బలగాల డిఎస్పి శ్రీనివాసులు, రిజర్వు ఇన్స్పెక్టర్ లు మంజునాథ్,సురేశ్ బాబు,RSI లు హర్షవర్ధన్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top