దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపు – మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త/ నంద్యాల /జనవరి 4 :

విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తు ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తు.. ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందన్నారు.  గడిచిన ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం వంటివి ఎదుర్కొందని విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలక మౌలిక రంగం అని . అలాంటి రంగాన్ని ముర్ఖపు నిర్ణయాలతో అప్పులపాల పాలు చేశారన్నారు. 2019లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారని అన్నారు. జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకర రోజున విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని ప్రగల్భాలు పలికారని కానీ, అధికారంలో ఉన్న తన ఐదేళ్ల ఆరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు భారం ప్రజల పై మోపాడని అన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అగమ్యగోచరమైన పరిస్థితి నెలకునేలా చేశాడని మంత్రి ఫరూక్ విమర్శించారు

Scroll to Top