దివ్యాంగుల సేవలు ఆదర్శనీయం – వెదుర్ల రామచంద్రరావు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 11 :
నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు రూ.15 వేల విలువైన నెలవారీ మందులను పంపిణీ చేశారు.
సంఘం అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెదుర్ల రామచంద్రరావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ, గత 24 సంవత్సరాలుగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులకు గత 20 సంవత్సరాలుగా నిరంతరం నెలవారీ మందులు అందజేయడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతుండటం అభినందనీయమన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ వైద్యులు, పట్టణ ప్రముఖుల సహకారంతో గత 24 ఏళ్లుగా వేలాది మంది దివ్యాంగులకు వైద్య సహాయం, అవసరమైన సాయాన్ని అందించగలిగామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఈ సేవలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదే కార్యక్రమంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మ, వచ్చే నెల దివ్యాంగులకు నెలవారీ మందుల కొనుగోలుకు ఉపయోగపడేలా రూ.9 వేల విరాళాన్ని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘానికి అందజేశారు. ఆమె సేవా మనసునుఅభినందించారు.
ఈ సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా దివ్యాంగులకు నిరంతరం సహకారం అందిస్తున్న వెదుర్ల రామచంద్రరావు, వర్ధంశెట్టి రాజారామ్‌తో పాటు ఈరోజు విరాళం అందజేసిన సుష్మను జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, దివ్యాంగుల ఉద్యోగుల విభాగం అధ్యక్షులు కిషోర్, కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, బాలచంద్రుడు, సుష్మ, కార్యాలయ కార్యదర్శులు అలా మధు, వెంకటేశ్వర్లు, సూర్య తదితరులు పాల్గొన్నారు. వక్తలు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా దివ్యాంగులకు నిరంతరం సహకారం అందిస్తున్న వెదుర్ల రామచంద్రరావు, వర్ధంశెట్టి రాజారామ్‌తో పాటు ఈరోజు విరాళం అందజేసిన సుష్మను జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, దివ్యాంగుల ఉద్యోగుల విభాగం అధ్యక్షులు కిషోర్, కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, బాలచంద్రుడు, సుష్మ, కార్యాలయ కార్యదర్శులు అలా మధు, వెంకటేశ్వర్లు, సూర్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top