ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో దివ్యాంగులకు నెలవారి మందుల పంపిణీ
దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ప్రశంసనీయం: డాక్టర్ గెలివి సహదేవుడు
దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయి – డాక్టర్ రవి కృష్ణ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17 :
నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహణలో మంగళ వారం జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏ.ఎన్.సీ. ఆగ్రోస్ చైర్మన్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి, సతీమణి రుక్మిణమ్మ సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు 16 వేల రూపాయల విలువ చేసే నెలవారి మందులను పంపిణీ చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి,ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, సూరన సారస్వత సంఘం అధ్యక్షుడు డాక్టర్ సహదేవుడు పాల్గొని ప్రసంగించారు.
ఆత్మకూరు సుదర్శనం శెట్టి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం గత 24 సంవత్సరాలుగా దివ్యాంగులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ దివ్యాంగుల సేవలకు నిరంతరం సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం దివ్యాంగులకు అవసరమైన మందులను కొనుగోలు చేసి గత 20 సంవత్సరాలుగా, ప్రతి నెల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయని, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ వైద్యులు,పట్టణ ప్రముఖుల సహకారంతో గత 24 సంవత్సరాలుగా వేలాది దివ్యాంగులకు సహకారం అందించామన్నారు. ఈ సందర్భంగా గత ఐదు దశాబ్దాలు పైగా లయన్స్ క్లబ్ ద్వారా సేవలందిస్తున్న ఆత్మకూరు సుదర్శనం శెట్టి, రుక్మిణమ్మ దంపతులను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్,సభ్యులు చంద్రశేఖర్,రామయ్య,కార్యాలయ కార్యదర్శులు అలా మధు,వెంకటేశ్వర్లు, సూర్య పాల్గొన్నారు.
