

ప్రజలు, అధికారులతో కలిసి తృప్తి కాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 09 :
రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం అనంతరం భోజన విరామ సమయంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ లు జిల్లా అధికారులు, ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి కాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు అక్కడ అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, వంట విధానం, ధరలు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సామాన్య ప్రజలకు తక్కువ ధరకు పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలనే లక్ష్యంతో తృప్తి కాంటీన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఈ తరహా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెప్మా పీడీకి కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో పాటు పలువురు జిల్లా అధికారులు మధ్యాహ్న భోజనంలో పాల్గొన్నారు.
