డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 16 :

నంద్యాల జిల్లా వ్యాప్తంగా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసు శాఖ డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టింది. జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్  ఆదేశాల మేరకు అటవీ పరిసరాలు, గ్రామ మరియు పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించారు.

నంద్యాల తాలూకా, నంద్యాల వన్ టౌన్, జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ ద్వారా పరిశీలించగా కొందరు వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇటువంటి డ్రోన్ పర్యవేక్షణలు తరచుగా నిర్వహిస్తూ జిల్లాలో అసాంఘిక మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Scroll to Top