జిల్లా వ్యాప్తంగా విస్తృత ‘విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న నంద్యాల జిల్లా పోలీస్

 

రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్ నేరాల నియంతరణ కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసు అధికారులు…..

 శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కోసం సంబంధించి 112 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలి.

నంద్యాల జిల్లా / జనవరి 03- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు,శాంతిభద్రతలు మరింత బలోపేతం కొరకు  విస్తృతంగా విసిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా, కట్టుదిట్టంగా మరియు నిరంతరంగా అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం వలన నేరాలకు ముందస్తు నియంత్రణ సాధించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు.

ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి సహా నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, నేర ప్రవృత్తులు కలిగిన వ్యక్తులపై గట్టి నిఘా కొనసాగిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులలో ప్రయాణించువారు సీటు బెల్ట్ వినియోగించాలి.

మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ప్రమాదకర చర్యలకు చేయకూడదని అవగాహన కల్పిస్తూ మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

 సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.

తెలియని లింకులు క్లిక్ చేయరాదని, OTP, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోరాదని అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.

జిల్లాలో ఎవరైనా సైబర్ మోసాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 కు కాల్ చేసి సహాయం పొందడమే కాకుండా మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు  సమాచారం అందించాలని సూచించారు.

జిల్లాలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా కొనసాగాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని జిల్లా పోలీసులు తెలిపారు. నీ చుట్టుపక్కల ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా 112 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా గాని కు గానీ సమాచారం అందించాలని మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Scroll to Top