చాగలమర్రి ఆలయ చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్..

 

5 కిలోల 800 గ్రాముల వెండి స్వాధీనం వాటి విలువ 14.76 లక్షలు..

జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS.

సత్యం వార్త/నంద్యాల క్రైమ్ రిపోర్టర్ /జనవరి 4:

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు, ఆళ్లగడ్డ DSP కె. ప్రమోద్ పర్యవేక్షణలో, ఆళ్లగడ్డ రూరల్ CI బి.వి. రమణ. చాగలమర్రి SI బి. సురేష్ మరియు వారి సిబ్బంది కలిసి ఆలయ చోరీ కేసును ఛేదించారు.

 చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన వెండి ఆభరణాల చోరీ కేసులో నిందితులను 04.01.2026 న పట్టుకున్నారు. ఆళగడ్డ మండలం, కోటకందుకూరు గ్రామానికి వెళ్లే మార్గంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలో నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల వద్ద నుంచి సుమారు 5 కిలోలు 800 గ్రాముల వెండి ఇటుక ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న వెండి విలువ సుమారు రూ.14,76,000/నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచి న్యాయ రిమాండ్ కు పంపడం జరిగింది.

చాగలమర్రి పోలీస్  Cr. No. 109/2025 U/s 305(e), 316(2), 316(4), 316(5). 317(2) r/w 3(5) BNS Act

ముద్దాయిలు :

1.మామిడి కృష్ణ కిషోర్, తండ్రి: నరసమయ్య, వయస్సు: 52 సంవత్సరాలు, గాయత్రి నగర్,

ఆళ్లగడ్డ టౌన్ (అర్చకుడు).

2 భాగవతం. వెంకట నర్సయ్య, తండ్రి: నర్సయ్య, వయస్సు: 63 సంవత్సరాలు. కోటకందుకూరు గ్రామం, ఆళ్లగడ్డ మండలం (రిటైర్డ్ ఈ.ఓ).

3. దూదేకుల పెద్ద హుసినయ్య, తండ్రి పక్కీరా, వయస్సు: 54 సంవత్సరాలు. లింగందిన్నె గ్రామం, ఆళ్లగడ్డ మండలం (బంగారు / వెండి వ్యాపారి).

ఈ కేసును వారం రోజులలోనే ఛేదించి, దొంగిలించబడిన వెండిని రికవరీ చేసినందుకు సంబంధిత అధికారులు మరియు సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ అభినందించారు.

Scroll to Top