
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 09 :
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం లోని బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామం నందు సిఎస్ఐ చర్చి పునఃప్రతిష్ట కార్యక్రమానికి బేడా బుడగజంగాల అధికార ప్రతినిధి, నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు 10వేల రూపాయలు ఆర్థిక విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్దలతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు సుధాకర్, సంపత్, శివ, యేసు మరియు స్థానిక టీడీపీ నాయకులు వడ్డే నాగేంద్ర, హిమామ్ హుస్సేన్, రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
