



ఆచారాలు ,వ్యవహారాలు తెలుసుకోకపోతే ఎంత చదివిన వ్యర్థమే
బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
సత్యం వార్త / నంద్యాల / జనవరి 24 :
సమాజంలో చదువు అనేది ఒక ఆయుధమని,ఆచారాలు వ్యవహారాలు తెలుసుకోకపోతే ఎంత చదువు చదివినా వ్యర్థమే అని నంద్యాల జిల్లా న్యాయమూర్తి డి. అమ్మన్ రాజా అన్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల లో శనివారం జాతీయ బాలిక దినోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్ డి. అమ్మన్ రాజా ( జిల్లా న్యాయమూర్తి నంద్యాల) కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ఏ .ఎస్ .ప్రగతి హాజరయ్యారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , విద్యార్థిని, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిధులను వేదికపైకి ఆహ్వానించడంతో మొదలైంది. వేదిక పైకి ముఖ్య అతిధులు అయినా .డి.అమ్మన్ రాజా , కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి తరువాత ఏ. ఎస్ . ప్రగతి మేడం రత్నారెడ్డి మేడం అలాగే శ్రావణి కుమారి మేడం వేదికపైన ఆసీనులయ్యారు. ప్రార్థన గేయ ఆలాపనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు తరువాత విద్యార్థినీ విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు అందజేశారు.
రత్నారెడ్డి మాట్లాడుతూ జాతీయ బాలిక దినోత్సవం అనే ఈ కార్యక్రమాన్ని మనము జనవరి 24వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ రోజున మనము బాల్య వివాహాల గురించి చర్చిస్తాను అలాగే బాలికల ఉన్నత చదువుపై వారి భవిష్యత్తు గురించి వారు ఎలా బాధ్యత వహించాలి అనేది తెలియజేస్తాము అని తెలియజేశారు.4 దశాబ్దాలుగా మనము మార్పులు అనేది చూస్తున్నాము దీనికి ముఖ్య కారణం స్త్రీ అని రంగాలలో అవగాహన కలిగి ఉండటమే దీనికి ముఖ్య కారణం అని తెలియజేశారు. ఇక్కడైతే ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉంటుందో అక్కడ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మీరు ఎవరిమీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటట్టు బాధ్యత వహించుకోవాలని అందరికీ తెలియజేశారు.
డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ఏ.ఎస్ .ప్రగతి మాట్లాడుతూ బాలికలు అనేవారు భవిష్యత్తు వారి దేశాన్ని నిర్మిస్తారు. అమ్మాయిలు ఎప్పుడు ఏదోక మార్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. పూర్వకాలంలో అమ్మాయిలు ఏ పని చేయకూడదు అని అంటూ ఉండేవారు. ఇప్పుడు మారిన పరిస్థితి కారణాల వలన మార్పుల వలన అమ్మాయిలు బయటికి వచ్చి బయటికి ప్రపంచాన్ని చూస్తూ తెలియని ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు బాగా చదువుకుంటున్నారు . ఏదైనా సాధించాలి లేదా మరణించాలి అనే ఉద్దేశంతో ఉండకూడదు మనం నీరు లాగా ఉండాలి ఎన్ని మలుపులు గున్న దాని వెంటనే వెళ్తూ మన గమ్యాన్ని మనం చేరుకోవాలి అని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. బాల్య వివాహాలు చేయటం అనేది నేరం మీ చుట్టుపక్కల ఎక్కడైనా బలేవాహాలు జరుగుచున్న తెలియని వారికి వాటి గురించి అవగాహన కల్పించి వేరే వారికి తెలియజెప్పాలి అని విద్యార్థి విద్యార్థులకు తెలియజేశారు. మంచి అమ్మాయిలు అందరు భవిష్యత్తును ధైర్యంగా మార్చలేరు, అమ్మాయిలు భవిష్యత్తును తయారు చేస్తారు అని తెలియజేశారు.
ప్రొఫెసర్ జి .రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాల మీద డి. అమ్మన్ రాజా గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అని తెలియజేశారు. బాల్య వివాహాలు ఎలా మొదలయ్యాయి అనే అంశాన్ని మనమందరం గమనించాలి భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అమ్మాయి మీద నమ్మకం లేకపోవడం వల్ల పరువు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు మరియు పెత్తందారీతనం వలన కూడా అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ఆ పిల్లలు మరో కొత్త తరానికి జన్మనిస్తే ఆ పుట్టిన ఆశీస్సులు అంగవైకల్యంతో పుడతారు అని తెలియజేశారు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది వారికి తెలియదు అని చెప్పారు. ఈ అంశం ఆలోచించి మంచి చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నామని విద్యార్థులకు తెలియజేశారు. మీరందరూ కూడా బాగా చదువుకుని సమాజానికి సహాయం చేయాలి అని చెప్పారు.
ముఖ్య అతిధులుగా హాజరైనటువంటి డి. అమ్మను రాజా మాట్లాడుతూ చదువు అనేది ఒక ఆయుధం. మన ఆచారాలు వ్యవహారాలు ఇవి ఏమి మనం తెలుసుకోకపోతే మనం ఎంత చదివిన వ్యర్థమే అన్నారు. ఐ వితౌట్ విజన్ , ఎడ్యుకేషన్ అండ్ డిస్ప్లేన్, మనకు ప్రత్యక్షంగా ఉన్న వారిని చూసి మనం వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో వాళ్లలాగా ఉన్నత స్థానంలోకి వెళ్లాలని కోరుకోవాలి. ఆయన ప్రగతి ని అభినందించారు అలాగే తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను. బాల్య వివాహాలు అన్నిటిని తగ్గిపోయాయి కానీ వాటి గురించి మనం అవగాహన కలిగి ఉండాలి అని తెలియజేశారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం అనేది నేరము . ఆపరేషన్ సింధూర్ యావత్ ప్రపంచం మన వైపు చూసింది కారణం దానికి బాధ్యత వహించింది స్త్రీలు. 25% మన బాధ్యతను తల్లిదండ్రులు మరియు 25% ఉపాధ్యాయులు మరియు 25% స్నేహితులు మరియు 25% మన వ్యక్తిగత అంశాల పైన మన బాధ్యతను ఆధారపడి ఉంటాయని తెలియజేశారు. ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులను తెలుసుకోవడం మన బాధ్యత మన మన హక్కుల గురించి తెలుసుకుంటున్నాము కానీ మనం చేయవలసిన పనులను గూర్చి మనం ఆలోచించటం లేదు అని తెలియజేశారు. విద్యార్థుల ముందర ప్రయోగం చేసి చూపించారు ఒక గ్లాసులో నీటిని తీసుకొని, రెండు నారింజ పళ్ళను తీసుకుని ఒక నారింజ పై తొక్క తీసివేసి ఆ పనులు నీటిలో వేస్తే అది మునిగిపోయింది, ఇంకొక నారింజను తీసుకొని నీటిలో వేశారు ఆ నారింజ పైన తేలుతూ ఉంది ఇది మీ తల్లిదండ్రులు , ఉపాధ్యాయుల లాంటిది మీరు వారు చెప్పినట్టు నడుచుకుంటే మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారని విద్యార్థి విద్యార్థులకు తెలియజేశారూ. చివరగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులైన . డి. అమ్మన్ రాజా ని కళాశాల చైర్మన్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంతో గౌరవపూర్వకంగా సన్మానించారు. అలాగే చివరగా జాతీయగీయ ఆలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.
