గ్రీట్ విత్ గ్రీన్’ పోస్టర్లను ఆవిష్కరించినరె డ్ క్రాస్ అధ్యక్షురాలు – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

   రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్రీట్ విత్ గ్రీన్’ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను బొకేలు, కేకులు వంటి సంప్రదాయ పద్ధతులకు బదులుగా మొక్కలు నాటి, విద్యాసామగ్రి అందజేసే విధంగా జరుపుకోవాలని జిల్లాలోని అధికారులకు పిలుపునిచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా పెంపొందిస్తాయని ఆమె తెలిపారు. జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ అధికారుల నుండి సేకరించిన మొక్కలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాటడం, అలాగే సేకరించిన విద్యాసామగ్రిని వసతి గృహాలలోని విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష, అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) అబ్దుల్ సమీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Scroll to Top