


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 10 :
రాష్ట్రంలోని క్రైస్తవులకు అండగా ఉంటానని ఏపీ స్టేట్ క్రిస్టియన్ ప్రత్యేక ప్రతినిధి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణం సెంట్రల్వేర్ హౌస్ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ద్యాన మందిరంలో ఏర్పాటు చేసిన దైవసేవకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బైబిల్ మిషన్ ద్యాన మందిర ఏఓ రెవరెండ్ బందెల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో దైవసేవకులకు డా. విజయ్ కొడాలి చేతుల మీదుగా నూతన వస్త్రాలను బహుకరించారు. అనంతపురం కూడేరు మండలం కొర్రపాడు గ్రామ బాధితులను పరామర్శించేందుకు ఆయన వెళ్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే పట్టణంలోని క్రిస్టియన్ జేఏసీ సెంట్రల్ ఆఫీస్ నందు రెండు తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి మన్నెం జానయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన సంవత్సర కేలండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవ నాయకులు జోసఫ్, పాస్టర్లు బెన్నిహిన్ పుటికెల, సామేల్, సురేష్, సామేల్, స్వామిదాస్, విజయ్, కిరణ్, క్రిస్టియన్ జేఏసీ సెంట్రల్ కమిటీ సభ్యులు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.
