క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు అందుబాటులోకి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 07 :

క్యాబ్ బుక్ చేసుకున్నంత సులభంగా వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ సేవలను వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో డ్రోన్ సేవలకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న “యుబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్” యాప్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డ్రోన్ సేవలను సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ డ్రోన్ సేవల ద్వారా పురుగుమందులు, ఎరువులు, విత్తనాలను వ్యవసాయ భూములపై చల్లే సౌకర్యం ఉందని, దీని వల్ల సమయం, కూలీల వ్యయం గణనీయంగా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఒకే యాప్‌లో అనేక వ్యవసాయ సేవలు పొందే వీలుందని తెలిపారు.

రైతులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా, ప్రతి ప్రాంతంలో అద్దెకు డ్రోన్ సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Scroll to Top