కొత్తూరు సుబ్బరాయునిలో ఘనంగా షష్టి వేడుకలు

కమనీయం “సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం

  • ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 24 :

ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు మాఘ శుద్ధ షష్టి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మాఘ మాసము శుద్ధ షష్టి రోజున శ్రీ స్వామి వారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్ స్వామి, క్రిష్ణయ్య స్వామి, రోహిత్ శర్మ, సుబ్బయ్య స్వామి వారు ఉదయం స్వామివారికి 108 లీటర్ల పాలాభిషేకము, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణమండపం నందు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేద మంత్రములతో విశేషాలంకరణలతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ కమనీయ కళ్యాణోత్సవం నిర్వహించారు. హాజరైన భక్తులందరికీ లడ్డు ప్రసాదము, శేష వస్త్రములు, అన్న ప్రసాదము వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, ఏఎస్ఐ రఫీ, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top